విషాదం.. గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
Two dead bodies found in EC canal. చోటుచేసుకుంది. ఈసీ వాగులో ఈతకోసం వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు
By తోట వంశీ కుమార్ Published on
26 Oct 2021 6:44 AM GMT

ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని వెంకటాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఈసీ వాగులో ఈతకోసం వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈతకొట్టేందుకు ఈసీ వాగుకు వద్దకు వచ్చారు. ఈత కొట్టేందుకు నీటిలో దిగగా.. ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఓ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Next Story