ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
TSRTC Bus Overturns in Vikarabad.వికారాబాద్‌లో జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా
By తోట వంశీ కుమార్ Published on
12 Nov 2021 10:11 AM GMT

వికారాబాద్‌లో జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మర్పల్లి మండలం కల్కొడ వద్ద జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూరు వైపు వెలుతున్న ఆర్టీసీ బస్సు కల్కొడ వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మర్పల్లి నుంచి వేర్వేరు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని ప్రయాణీకులు చెబుతున్నారు. మలసోమారం, పెద్దాపూర్, ఇందోల్, తాండూర్, సదాశివపేట్, మొరంగపల్లి, కొడంగల్, జహీరాబాద్, పద్దేముల్, కేశారం గ్రామాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
Next Story