ప్రియుడితో పారిపోయిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Gujarat Crime News. ఓ వివాహిత మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. దీంతో అవమానంగా
By తోట వంశీ కుమార్ Published on 16 July 2021 8:03 AM GMTఓ వివాహిత మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. దీంతో అవమానంగా బావించిన ఆమె భర్త.. గ్రామ పెద్దల సహకారంతో ఆమెను వెతికి పట్టుకున్నాడు. అనంతరం గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సబ్యులతో కలిసి భార్యను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించాడు. ఈ అమానుష ఘటన గత నెలలో గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో దీనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దహోడ్ జిల్లాలోని ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వివాహిత (23) గత నెలలో మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. దీంతో తమ పరువుపోయిందని బావించాడు ఆమె భర్త. ఎలాగోలా గ్రామస్తుల సహకారంతో భార్యను వెతికిపట్టుకున్నాడు. అనంతరం వారిద్దరికి గ్రామానికి తీసుకువచ్చి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. వివాహం జరిగిన తరువాత మరో వ్యక్తితో పారిపోయింనదుకు గాను ఆమెకు శిక్షగా.. భర్తను భుజాలపై ఎత్తుకుని నడవాలని ఆదేశించారు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతో పాటు వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికంగా వైరల్‌గా మారాయి. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్తతో పాటు మరో 18 మందిని అరెస్టు చేశారు.