యాదాద్రి జిల్లాలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసి తల్లి ఆత్మహత్యాయత్నం.. కుమార్తె మృతి!

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

By -  అంజి
Published on : 15 March 2026 1:41 PM IST

Yadadri Bhuvanagiri Crime News, Tukkapuram Family Tragedy, Mother Attacks Kids with Knife, Bhuvanagiri Suicide Attempt, Family Disputes Crime, Kruti Reddy Death News

యాదాద్రి జిల్లాలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసి తల్లి ఆత్మహత్యాయత్నం.. కుమార్తె మృతి!

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలు, భర్తతో తరచూ జరిగే విభేదాలను భరించలేక నీలిమ అనే మహిళ తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, అనంతరం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘోర కలికాలంలో 14 ఏళ్ల కుమార్తె కృతిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, 11 ఏళ్ల కుమారుడు అశాంత్‌రెడ్డి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నరేందర్‌రెడ్డి, నీలిమ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నీలిమ, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోగా, గాయపడిన అశాంత్‌రెడ్డిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన తల్లి నీలిమ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కృతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలకు గల కారణాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం తుక్కపురం గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

Next Story