క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం
Tipper Overturned in Khajipet three died.హన్మకొండ జిల్లా కాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ అదుపు తప్పి
By తోట వంశీ కుమార్ Published on
18 Dec 2021 8:22 AM GMT

హన్మకొండ జిల్లా కాజీపేటలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో శనివారం వేగంగా వచ్చిన టిప్పర్ అదుపు తప్పింది. అక్కడే పనిచేస్తున్న ముగ్గురిపై టిప్పర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై వివరాలు సేకరించారు. మృతులను మహబూబాబాబ్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన అఖీమ్ గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన మడికొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story