టిక్‌టాక్ స్టార్ ఆత్మ‌హ‌త్య‌.. 'ఇదే నా చివ‌రి పోస్ట్'

Tiktok sensation Dazhariaa Quint Noyes dies by suicide at 18.సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎంతో చిన్న వ‌య‌సులోనే స్టార్‌గా అవ‌రించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 5:57 AM GMT
Tiktok sensation Dazhariaa Quint Noyes dies by suicide at 18

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎంతో చిన్న వ‌య‌సులోనే సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. కొంద‌రు ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఒత్తిడిని త‌ట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. లూసియానాలోని బాటన్ రూజ్‌కు చెందిన దజారియా క్వింట్ నోయెస్ టిక్‌టాక్ పుణ్య‌మా అని 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే స్టార్‌గా అవ‌రించింది. ఆమెకు టిక్‌టాక్‌లో 10.5ల‌క్ష‌ల మంది పాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె చేసే వీడియోల‌కు ల‌క్ష‌ల సంఖ్య‌లో లైకులు, షేర్లు వ‌స్తుంటాయి. అయితే.. ఏమైందో తెలీదు కానీ.. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కుటుంబసభ్యులతో పాటు ఫ్యాన్స్ ని విషాదంలోకి నెట్టేసింది.

తన చివరి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'సరే, నాకు తెలుసు, నేను బాధిస్తున్నాను ఇది నా చివరి పోస్ట్'. అని రాసుకొచ్చింది. అనంత‌రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె మ‌ర‌ణించిన విష‌యాన్ని ధృవీక‌రించారు. ఆమె తండ్రి రహీమ్ అల్లా మాట్లాడుతూ.. మాన‌సిక ఒత్తిడితోనే త‌న కుమారై ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చున‌ని భావిస్తున్నాన‌ని చెప్పారు. త‌న‌ను ముట్టుకోవాల‌ని ఉంద‌ని.. తాను ఇంటికి వ‌చ్చే స‌రికి ఎవ‌రు త‌న కోసం వేచి ఉంటార‌ని ఏడ్చాడు. త‌న కుమారైనే త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇప్పుడు ఆమె పాతిపెట్ట‌డానికి తాను సిద్దంగా లేన‌న్నారు.

దజారియాకు టిక్‌టాక్‌లో మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా బ్యూటీ షాపును కూడా నడిపింది. అక్కడ ఆమెకు 1,12,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె మరణంతో షాక్‌కు గురైన అభిమానులు ఆమె యూట్యూబ్ పేజీలో సంతాపం తెలుపుతున్నారు. మీరు మా అభిమాన యూ ట్యూబర్.. ఇది జరిగిందనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.


Next Story
Share it