విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. 3 నెలల చిన్నారి మృతి
Three months baby dies with snake bite in Mahabubabad.మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని
By తోట వంశీ కుమార్ Published on
7 Nov 2021 7:24 AM GMT

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురుని పాము కాటేసింది. ఈ ఘటన లో మూడు నెలల చిన్నారి మృతి చెందగా.. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శనిగపురం గ్రామంలో మమత, క్రాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల చిన్నారి సంతానం. కాగా.. ఎప్పటిలాగే శనివారం రాత్రి వారు పడుకున్నారు. ఆదివారం ఉదయం నిద్రలేచి చూసే సరికి పాప నోటి వెంట నురుగు రావడాన్ని దంపతులు గుర్తించారు.
వెంటనే పాపను తీసుకుని ఆస్పత్రికి వచ్చారు. చికిత్స చేసేందుకు పాపకు కప్పిన దుప్పటిని తీయగా.. అందులోంచి పాము బయటకు వచ్చింది. అప్పటికే పాప మృతి చెందింది. కాసేపటికే మమత, క్రాంతి దంపతులు స్పృహా కోల్పోయారు. దీంతో వారిని కూడా పాము కరిచిందని నిర్థారించుకుని అదే ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. పాము కాటుకు మూడు నెలల చిన్నారి మృతి చెందడంతో శనిగపురం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story