విషాదం: అలీసాగర్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి

Three Girls Fell in-Ali sagar .. నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడపల్లి

By సుభాష్
Published on : 15 Nov 2020 2:24 PM

విషాదం: అలీసాగర్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి

సరదా సెల్ఫీ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్‌ నుంచి బంధువుల ఇంటికి వచ్చిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని పర్యాటక ప్రాంతమైన అలీసాగర్‌ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఆదివారం కావడంతో సరదగా అలీసాగర్‌లో బోటింగ్‌ చేద్దామని ముగ్గురు బాలికలు చెరువు కట్ట వరకు వెళ్లి సెల్ఫీల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో నీళ్లలో పడి మృత్యువాత పడ్డారు.

వీరిలో ఇద్దరు బాలికలు హైదరాబాద్‌కు చెందిన వారని తెలుస్తోంది. వీరంతా బోధన్‌లోని రాకాసిపేటకు చెందిన ఓ బంధువు ఇంటికి వచ్చినట్లు సమాచారం. మృతులు మాహేరా (14), జుబేరా (15) మోహరాజ్‌ 13) అని చెబుతున్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story