జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ముగ్గురు మృతి
Three died after car collides with RTC Bus in Korutla.జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ
By తోట వంశీ కుమార్ Published on
5 Dec 2021 7:28 AM GMT

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కోరుట్లలోని బిలాల్‌పుర ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కోరుట్లకు చేరుకుంటామనగా.. మోహన్‌రావు పేట శివారులోని వంతెన వద్ద జగిత్యాల వైపు వెళ్తున్నఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్ సాజిద్ అలీ(45)తో పాటు ఓ చిన్నారి అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. మరో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story