స్వ‌లింగ సంప‌ర్కుల (గే).. రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు

Three Accused arrested by Mumbai Police.ముంబైలో తొలిసారిగా గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ముగ్గురు

By M.S.R  Published on  19 Jan 2022 8:37 AM GMT
స్వ‌లింగ సంప‌ర్కుల (గే).. రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు

ముంబైలో తొలిసారిగా గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ డేటింగ్ గే యాప్ 'గ్రైండర్' ద్వారా ఈ ముఠా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వీడియోలు తీసి పలువురిని బ్లాక్‌మెయిల్ చేసేది. ఐదుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి డబ్బులు, కార్డులు లాక్కున్నారని, అతనిపై అభ్యంతరకర వీడియో కూడా తీశారని ఫిర్యాదు అందిందని మల్వానీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హసన్ ములానీ తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. నిందితులను ఇర్ఫాన్ ఫుర్కాన్ ఖాన్, అహ్మద్ ఫరూఖీ షేక్, ఇమ్రాన్ షఫీక్ షేక్‌లుగా గుర్తించారు. ముగ్గురూ 24 నుంచి 26 ఏళ్ల లోపు వారే. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఆన్‌లైన్ యాప్ ద్వారా స్వలింగ సంపర్కులను సంప్రదిస్తున్నారని, డబ్బు తీసుకుని కావాల్సినది ఇస్తామని హామీ ఇచ్చేవారని పోలీసులు వివరించారు.

ఈ ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఆన్‌లైన్ యాప్ ద్వారా సంప్రదించారు. అతడి నుంచి గంటకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ లోని నలుగురు అతడిని సంప్రదించారు. ఆ యువకులు బాధితుడిపై దాడి చేశారు. బాధితుడి దగ్గర ఉన్న డబ్బు, నగలు, ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లారు. ఆ యువకుడిపై అభ్యంతరకర వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఎలాగోలా వారి బారి నుంచి యువకుడు తప్పించుకుని కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story
Share it