మ‌హిళ‌ మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో చుట్టి.. చెరువులో ప‌డేస్తూ..

The wife wrapped the body in a blanket.ఓ మ‌హిళ మృతదేహాన్ని దుప్ప‌ట్టిలో చుట్టి చెరువులో ప‌డేస్తుండ‌గా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2021 5:39 AM GMT
మ‌హిళ‌ మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో చుట్టి.. చెరువులో ప‌డేస్తూ..

ఓ మ‌హిళ మృతదేహాన్ని దుప్ప‌ట్టిలో చుట్టి చెరువులో ప‌డేస్తుండ‌గా.. గ‌మ‌నించిన స్థానికులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో జ‌రిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. హ‌య‌త్‌న‌గ‌ర్ పాత రోడ్డు స‌మీపంలోని హ‌నుమాన్ ఆల‌యం ప‌క్క‌న గ‌ల్లీలో డేగ శ్రీను, ల‌క్ష్మీ(30) దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కొడుకు, కుమారై సంతానం.

కాగా.. శ్రీను గురువారం రాత్రి 10.45 గంట‌ల స‌మ‌యంలో త‌న స్నేహితుడు వినోద్‌తో క‌లిసి ల‌క్ష్మీ మృత‌దేహాన్ని చ‌ద్ద‌రులో చుట్టి బాతుల చెరువు అలుగు వ‌ద్ద ప‌డేస్తుండ‌గా.. స్థానికులు గ‌మ‌నించారు. వెంట‌నే ఆ ఇద్ద‌రిని ప‌ట్టుకుని ప్ర‌శ్నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో తన భార్య మ‌ర‌ణించింద‌ని.. దహన‌ సంస్కారాలకు న‌గ‌దు లేకపోవడంతో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు శ్రీను చెప్పాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. మృతురాలి ఇంటిని పోలీసులు పరిశీలించారు. అనారోగ్యంతో మ‌ర‌ణించిందా..? లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు.

Next Story