గ్యాస్ కటర్ తో వచ్చారు.. 15 లక్షలు దోచుకెళ్లారు

The miscreants took away 15 lakhs by cutting the ATM with a gas cutter.రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఫతేపూర్ షెఖావతి ప్రాంతంలో

By M.S.R  Published on  8 March 2022 5:15 PM IST
గ్యాస్ కటర్ తో వచ్చారు.. 15 లక్షలు దోచుకెళ్లారు

రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఫతేపూర్ షెఖావతి ప్రాంతంలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. ఎంతో సులువుగాగా దొంగతనం చేశారని చెబుతున్నారు. గ్యాస్ కట్టర్‌తో కోసి అందులోని రూ.15 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ ఘటన మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే దుండగులు తమ పూర్తి చేశారు.

ఈ దొంగల ముఠా చాలా తెలివిగా ఏటీఎంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాపై స్ప్రే చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ చర్య ATM లోపల ఉన్న సీసీటీవీ కెమెరా దొంగల చర్యలను క్యాప్చర్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం దొంగలు తెల్లటి రంగు స్విఫ్ట్ కారులో వచ్చినట్లు తెలుస్తోంది. కారులోంచి గ్యాస్ కట్టర్ తీసి ఏటీఎంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఏటీఎం మెషీన్‌లో నగదు మొత్తం తీసుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ సందీప్, ఈ విషయం తనకు తెలియగానే, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం ఏటీఎంలో 15 లక్షల రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసును నిశితంగా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ సహాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Next Story