మొక్కలకు నీళ్లు పడుతూ బిల్డింగ్ పైనుంచి పడి బాలిక మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla
మొక్కలకు నీళ్లు పడుతూ బిల్డింగ్ పైనుంచి పడి బాలిక మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. నోయిడాలోని బిల్డింగ్‌పై ఓ బాలిక మొక్కలకు నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. 18 అంతస్తుపై ఉండి నీళ్లు పడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
బిల్డింగ్‌పై నుంచి పడిన బాలికను 12వ తరగతి విద్యార్థినిగా పోలీసులు చెప్పారు. అయితే.. పైనుంచి పడిన వెంటనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేశామని చెప్పారు. బిసార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిమాలయ ప్రైడ్ సొసైటీలో బాలిక భవనం పైనుంచి పడి మృతిచెందినట్లు ప్రకటనలో తెలిపారు. కాగా.. ఇటీవలే మృతురాలు 12వ తరగతి పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఇక అనుకోని సంఘటనలో బాలిక మృతిచెందడంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఇక ఈ సంఘటనకు ఒక్కరోజు ముందే నోయిడాలో ఏడో తరగతి బాలుడు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తు నుంచి సూసైడ్ చేసుకున్నాడు.