దీపావళి పండగ రోజు విషాదం.. నిజాంసాగర్‌ కాల్వలో ఈతకెళ్లి యువకుల మృతి

The Death of a young man who swim.. దీపావళి పర్వదినం రోజున కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో శనివారం

By సుభాష్  Published on  15 Nov 2020 9:14 AM GMT
దీపావళి పండగ రోజు విషాదం.. నిజాంసాగర్‌ కాల్వలో ఈతకెళ్లి యువకుల మృతి

దీపావళి పర్వదినం రోజున కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో శనివారం విషాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వలో ఈతకెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. పండగ పూట జిల్లాకు చెందిన ఐదుగురు యువకులు నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన ఉన్న కాల్వలోకి స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురు యువకులను రక్షించగా, మరో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులు సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలానికి చెందిన వారుగా గుర్తించారు. అయితే డ్యాం గేట్ల వద్ద స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

అలాగే ములుగు జిల్లాలో కూడా విషాదం చోటు చేసుకుంది. గోదావరిలోకి స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. రంగాయపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరిలో స్నానానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో శ్రీకాంత్‌, కార్తీక్‌, ప్రకాశ్, అన్వేష్ ఉన్నారు. అయితే వీరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Next Story