ఇంటి ఓన‌ర్‌ను హ‌త్య చేసి.. మృత‌దేహంతో సెల్ఫీ

Tenant kills man with hammer in Delhi.దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అద్దెకు ఉండే వ్య‌క్తి రోజు మ‌ద్యం తాగి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2022 7:32 AM IST
ఇంటి ఓన‌ర్‌ను హ‌త్య చేసి.. మృత‌దేహంతో సెల్ఫీ

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అద్దెకు ఉండే వ్య‌క్తి రోజు మ‌ద్యం తాగి వ‌స్తుండ‌డంతో ఇంటి ఓన‌ర్ అభ్యంత‌రం తెలిపాడు. దీనిపై ఆగ్ర‌హించిన అద్దెకు ఉండే వ్య‌క్తి.. ఓన‌ర్‌ను సుత్తితో కొట్టి హ‌త్య చేసి అనంత‌రం మృత‌దేహాంతో సెల్పీ దిగి అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు 24 గంట‌ల్లోనే నిందితుడిని ప‌ట్టుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన పంక‌జ్‌కుమార్ అనే వ్య‌క్తి ఈ నెల‌( ఆగ‌స్టు) 5న సురేష్ అనే వ్య‌క్తి ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే.. పంక‌జ్ నిత్యం మద్యం తాగి ఇంటికి వ‌స్తుండేవాడు. దీనిపై ఇంటి య‌జ‌మాని సురేష్ ప‌లుమార్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికి ప‌ట్టించుకోలేదు. ఈ నెల‌9న కూడా పంక‌జ్ మ‌ద్యం తాగి వ‌చ్చాడు. దీనిపై పంక‌జ్‌ను సురేష్ నిల‌దీశాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. చివ‌ర‌కు పంక‌జ్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో అక్క‌డితో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

క‌క్ష పెంచుకున్న పంక‌జ్‌.. ఇటీవ‌ల సురేష్‌ను హ‌త్య చేశాడు. అనంత‌రం మృత‌దేహంతో సెల్పీ తీసుకుని , మృతుడి ఐడీ కార్డు, సెల్‌ఫోన్ తీసుకుని అక్క‌డి నుంచి ప‌రారు అయ్యాడు. హ‌త్య చేసిన ఒక రోజు త‌రువాత మృతుడి కుమారుడు జ‌గ‌దీశ్‌కు ఫోన్ చేసి.. మీ తండ్రి దూషించ‌డంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన‌ట్లు చెప్పాడు. అనుమానం వ‌చ్చిన జ‌గ‌దీశ్.. వెంట‌నే ఇంటికి చేరుకుని మొద‌టి అంత‌స్తులోని అద్దె గ‌దిలోకి వెళ్లి చూశాడు. అక్క‌డ త‌న తండ్రి సురేశ్ మ‌ర‌ణించి ఉండ‌టాన్ని చూసి షాక్ కు గురైయ్యాడు. తేరుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 24 గంట‌ల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story