ఎట్టకేలకు.. బెయిల్ వచ్చింది
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జూన్ 3న అరెస్టయిన తెలుగు నటి హేమకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
By అంజి Published on 13 Jun 2024 8:00 AM ISTఎట్టకేలకు.. బెయిల్ వచ్చింది
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జూన్ 3న అరెస్టయిన తెలుగు నటి హేమకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని హేమ తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించడంతో ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను ఆమోదించింది. అరెస్టు చేసిన చాలా రోజుల తర్వాత హేమకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు హేమ తరపు లాయర్ తెలిపారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశించింది.
ఎఫ్ఐఆర్ ప్రకారం, మే 19 న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షించిన 27 మంది మహిళల్లో హేమ కూడా ఉన్నారు. కేంద్ర క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పక్కా సమాచారం ఆధారంగా ఫామ్‌హౌస్‌పై దాడి చేసి హాజరైన వారి నుండి రక్త నమూనాలను సేకరించింది. పుట్టినరోజు వేడుకల నెపంతో రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని ఎఫ్‌ఐఆర్ లో ఉంది. ఈ పార్టీకి హాజరైన వారిలో 103 మందిలో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నారని తేలింది. అయితే, ఆ సమయంలో తాను హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లో ఉన్నానని తన పేరును అనవసరంగా లాగారని హేమ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. అయితే హేమ అబద్ధాలు చెబుతోందంటూ బెంగళూరు పోలీసులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు.