బంధువుల వల్ల దంపతుల ఆత్మహత్య.. సెల్పీ వీడియో

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  16 July 2024 1:30 PM IST
Telangana, couple suicide,  Nizamabad,

బంధువుల వల్ల దంపతుల ఆత్మహత్య.. సెల్పీ వీడియో 

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల వల్లే తాము చనిపోతున్నాం అంటూ దంపతులు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం వీరి సూసైడ్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ రైల్వే గేటు దగ్గర నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సెల్ఫీ సూసైడ్ వీడియోను చిత్రీకరించారు. భార్య మాట్లాడుతూ... 'నేను ఓ తప్పు చేశా. నా భర్త నన్ను క్షమించాడు. నా అత్త మామ కూడా నన్ను క్షమించారు. కానీ మా పిన్ని మాత్రం నాపై దుష్ప్రచారం చేస్తూనే వచ్చింది. తెలిసిన వాళ్లందరికీ మా పిన్ని నా గురించి చెడుగా చెప్తూ తిరుగుతుంది చెప్పవద్దు అంటూ ఎన్నిసార్లు వారించినా కూడా మా పిన్ని వినకుండా బయట దుష్ప్రచారం చేస్తూనే ఉంది. అది భరించలేక తన భర్త రెండు వారాల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా కూడా తన పిన్ని ఎవరి మాట లెక్కచేయకుండా తమ గురించి చెడుగా అందరికీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఎక్కడ మొహం చూపించుకోలేకపోతున్నాం. వాళ్ల దుష్ప్రచారం తట్టు కోలేకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము చనిపోయిన తర్వాత మా అత్తమామలను నా అన్నయ్య అడగాల్సిన అవసరం కానీ హక్కు కానీ లేదు'. అని మహిళ సూసైడ్ వీడియోలో చెప్పింది.

అయితే.. కేవలం బంధువుల దుష్ప్రచారం వల్లనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ ఆ గృహిణి సెల్ఫీ వీడియో తీసి పోలీసులకు పంపించింది. కానీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం అయ్యింది. దాంతో.. ఈ నవ దంపతులు మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి శైలజ, అనిల్‌కు మార్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ ఏడాది క్రితం వివాహం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు.

Next Story