Janagama: భార్య ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ బలవన్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని జనగాం పట్టణంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య
By అంజి Published on 6 April 2023 8:15 AM GMTJanagama: భార్య ఆత్మహత్య తట్టుకోలేక.. తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ బలవన్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని జనగాం పట్టణంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల తర్వాత శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. శ్రీనివాస్ (55) తన భార్య స్వరూప (50) ఆత్మహత్య చేసుకోవడంతో ఓదార్చేందుకు కొందరు పోలీసు అధికారులు అతడి ఇంటికి వచ్చారు. పోలీసులు ఉన్న సమయంలోనే తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున స్వరూప బాత్‌రూమ్‌లో కండువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్‌కి మెలకువ వచ్చి బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకున్నారు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేందర్ రెడ్డి, పట్టణ ఇంచార్జి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు, ఇతర అధికారులు కూడా ఎస్‌ఐ ఇంటికి చేరుకున్నారు. ఇంతలో బెడ్ రూంలో వారితో పాటు కూర్చున్న శ్రీనివాస్ వాష్ రూంలోకి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత తుపాకీ శబ్దం వినిపించింది అధికారులకు. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా ఎస్‌ఐ శవమై కనిపించాడు.
దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.