విషాదం.. బావిలో మునిగి హైదరాబాద్‌ టెక్కీ మృతి

Techie from Secunderabad drowns in well at recreational place in Vikarabad district. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శనివారం వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో ఎంటర్టైన్మెంట్‌

By అంజి  Published on  30 Oct 2022 1:18 PM IST
విషాదం.. బావిలో మునిగి హైదరాబాద్‌ టెక్కీ మృతి

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శనివారం వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో ఎంటర్టైన్మెంట్‌ ప్రదేశంలో వ్యవసాయ బావిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం గోధుమగూడ గ్రామ సమీపంలోని అడ్వెంచర్‌ క్లబ్‌ క్యాంప్‌ సైట్‌ వద్దకు సరదాగా గడపడానికి కొందరు వ్యక్తులు వచ్చారు. శనివారం సికింద్రాబాద్‌కు చెందిన సాయి కుమార్‌ (35) అనే వ్యక్తి ఆటలో భాగంగా బావి దగ్గరకు వెళ్లి బావిలో పడిపోయాడు.

శనివారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ''అతను బావిలో దూకినాడో లేక పడిపోయాడో తెలియదు. ఇది గేమ్ సమయంలో జరిగింది. సమాచారం మేరకు మేము సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని వెలికితీసాము.'' అని ధరూర్ పోలీసులు తెలిపారు. చీకటి పడటంతో బావిలో నుంచి మృతదేహాన్ని పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

Next Story