హీలియం గ్యాస్ పీల్చుకుని టెక్కీ ఆత్మహత్య
బెంగళూరులోని ఓ హోటల్‌లో మంగళవారం 24 ఏళ్ల యువకుడు హీలియం వాయువు పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Aug 2024 2:04 PM ISTహీలియం గ్యాస్ పీల్చుకుని టెక్కీ ఆత్మహత్య
బెంగళూరులోని ఓ హోటల్‌లో మంగళవారం 24 ఏళ్ల యువకుడు హీలియం వాయువు పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన యాగ్నిక్ అనే యువకుడిది కర్ణాటకలోని హాసన్ జిల్లా అని పోలీసులు తెలిపారు. అతడు బెంగళూరులోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కంపెనీ విప్రోలో పనిచేస్తున్నాడు. హోటల్ సిబ్బందికి ఫోన్ చేసినా యాగ్నిక్ స్పందించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అతని భద్రత గురించి ఆందోళన చెందిన హోటల్ రాయల్ ఇన్ సిబ్బంది మాస్టర్ కీని ఉపయోగించి గదిని తెరిచి చూడగా గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
వెంటనే హోటల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఈస్ట్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) మాట్లాడుతూ.. యువకుడు బెంగళూరులోని విప్రోలో పనిచేస్తున్నాడు. ఎంటెక్ పరీక్షలకు సిద్ధం కావడానికి హోటల్‌లో గది తీసుకున్నాడు. మధ్యాహ్నానికి కూడా గది తలుపులు మూసి ఉండడంతో హోటల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
గత ఏడాది ప్రారంభంలో, బెంగళూరులో ఎనిమిది నెలల శిశువుతో సహా తన భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి ఒక టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు.