దారుణం.. ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిపై అత్యాచారం చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Nov 2023 7:34 AM IST
teachers, rape,  6th class student, odisha,

దారుణం.. ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే.. చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఒంటరిగా కనబడగానే.. లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆరో తరగతని చదువుతున్న 11 ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా పాశవికంగా ప్రవర్తించారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులుఇద్దరూ కటకటాలు లెక్కిస్తున్నారు.

ఒడిశా నబరంగ్‌పూర్ జిల్లాలోని కుందేయ్​ ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాధితురాలు.. ఆరో తరగతి చదువుతోంది. ఆమె టాయిలెట్‌కు వెళ్లిన సాయమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడుతో పాటు మరో ఉపాధ్యాయుడు బాత్రూమ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. నవంబర్‌ 7వ తేదీన ఈ అత్యాచార సంఘటన జరిగింది.

ఇక ఆ తర్వాత నవంబర్ 9న బాధితురాలు పొత్తి కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో.. వారు అమ్మాయిన ఆస్పత్రికి తీసుకెళ్లి చూయించారు. అప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు విద్యార్థినిని పరిశీలించి.. లైంగిక దాడి జరిగినట్లు తేల్చారు. ఈ విషయం విన్న తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. దాంతో.. వెంటనే కుందేయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం నబరంగ్​పుర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. నవంబరు 7న గిరిజన విద్యార్థినిపై అత్యాచారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. హెడ్‌మాస్టర్‌తో పాటు.. మరో ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య వైద్యాధికారిని కోరింది. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.

Next Story