క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు.. టీడీపీ నేత‌ల దారుణ హత్య

TDP leaders brutally murdered in kurnool district.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ గొడవలు మరోసారి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Jun 2021 5:56 AM

క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు.. టీడీపీ నేత‌ల దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నేత‌ల‌ను ప్రత్యర్థులు వాహ‌నంతో ఢీ కొట్టి హ‌త‌మార్చారు. పెసరవాయి మాజీ సర్పంచ్‌ నాగేశ్వర్‌ రెడ్డి అతడి సోదరుడు సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి ఉదయం శ్మశాన వాటికకు వెళ్లి వస్తుండ‌గా.. కాపు కాసిన ప్ర‌త్య‌ర్థులు బొలేరో వాహ‌నంతో ఢీ కొట్టి హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వైసీపీ నాయకులే తమ వారిని హత్య చేశారని బంధువుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అన్న‌ద‌మ్ముల వ‌ర్గానికి, శ్రీకాంత్‌రెడ్డి అనే వ‌ర్గానికి ద‌శాబ్దాలుగా ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లాన్నినంద్యాల డీఎస్పీ చిదానంద ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story