తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది., ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను గొడ్డలితో నరికి దారుణంగా హత మార్చాడు. అనంతరం అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తిరువణ్ణామలై జిల్లా కలసప్పక్కం పక్కనే ఓరంతవాడి గ్రామంలో పళనిస్వామి, వల్లీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి నలుగురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి సంతానం. పళనిస్వామి వ్యవసాయం చేసేవాడు. అయితే.. గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందరూ పడుతున్న తరువాత పళనిస్వామి.. భార్య. పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.