భార్య ప్రియుడిని చంపిన భర్త
Tamil Nadu man arrested for murdering wife's lover after learning about their affair. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా వెలంపాళయంలోని 45 ఏళ్ల వ్యక్తిని మార్చి 19, శనివారం
By Medi Samrat Published on
21 March 2022 10:39 AM GMT

తమిళనాడులోని తిరుపూర్ జిల్లా వెలంపాళయంలోని 45 ఏళ్ల వ్యక్తిని మార్చి 19, శనివారం, తన భార్య ప్రియుడిని చంపినందుకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శశికుమార్ తన భార్య ప్రియ, ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుపూర్ నగరంలో ఉంటున్నాడు. భార్యాభర్తలు బనియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య ప్రియ తన సహోద్యోగి తమిళరసన్‌తో ఏడాది కాలంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న శశికుమార్ తప్పు అని మందలించాడు. అక్రమ సంబంధాన్ని వదిలేయాలని హెచ్చరించాడు.
ప్రియ ప్రేమికుడు తమిళరసన్ తన తల్లి, ఇద్దరు కొడుకులు, తమ్ముడితో కలిసి వెలంపాళయంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. తమిళరసన్ ఇంటికి ప్రియ తరచూ వచ్చేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. శశికుమార్ తన భార్య ప్రియుడిని హత్య చేసిన తర్వాత.. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు.
Next Story