హైదరాబాద్‌లో దారుణం.. మహిళ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి.. లైంగిక వేధింపులు

Sympathizer records private videos of woman, man arrested. సానుభూతి పేరుతో మహిళను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఏసీ, గీజర్ రిపేర్ కోసం

By అంజి  Published on  4 Dec 2022 11:19 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. మహిళ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి.. లైంగిక వేధింపులు

సానుభూతి పేరుతో మహిళను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఏసీ, గీజర్ రిపేర్ కోసం మెకానిక్‌ను తీసుకెళ్లిన రియాజ్ అనే నిందితుడు సీక్రెట్‌ కెమెరా సహాయంతో బాధితురాలి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి తన లైంగిక కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశాడు. అయితే అరెస్టయిన యువకుడు, బాధిత మహిళ ఒకరికొకరు సుపరిచితులే. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.

భర్త లేకపోవడంతో ఆ మహిళ తరచూ ఇంటి పనుల విషయమై ఆ వ్యక్తి సహాయం కోరేది. రియాజ్‌ ఇదే అదనుగా మలుచుకున్నాడు. రియాజ్ ప్రముఖ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బాధితురాలు అల్వాల్‌లో మొబైల్ షాప్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఏసీ, గీజర్ రిపేర్ చేయడానికి మెకానిక్ కోసం వెతుకుతోంది. మహిళ షాప్‌కి తరచూ వచ్చే రియాజ్, ఆమె సానుభూతితో తన సహాయాన్ని అందజేస్తానని చెప్పాడు.

రియాజ్ తనతో పాటు ఏసీ మెకానిక్‌ను బాధితురాలి ఇంటికి తీసుకెళ్లి మహిళ ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. ఈ కెమెరా సాయంతో బాధితురాలి ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసి తన లైంగిక కోరిక తీర్చుకునేందుకు మహిళను వేధించడం ప్రారంభించాడు. తన లైంగిక కోరిక తీర్చుకోకపోతే చంపేస్తానని మహిళను బెదిరించాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తన చిత్రాల పోస్టర్లను సిద్ధం చేసి ఇరుగుపొరుగు ఇళ్లపై అతికించాలని, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో మహిళ సహాయం కోసం షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Next Story