దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..

బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు.

By -  అంజి
Published on : 23 Sept 2025 1:30 PM IST

Suspecting affair, Bengaluru, man stabs wife, daughter

దారుణం.. కూతురి ముందే భార్యను పొడిచి చంపిన భర్త.. 11 సార్లు కత్తితో పొడిచి..

బెంగళూరులోని కామాక్షిపాల్య ప్రాంతంలో రేఖ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త లోహితాశ్వ 11 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దాడి సుంకడకట్టే బస్ స్టాండ్ వద్ద ప్రజలు చూస్తుండగా జరిగింది. రేఖ 13 ఏళ్ల కుమార్తె ఈ నేరాన్ని చూసింది. సిరాకు చెందిన రేఖ నాలుగు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లింది. ఆమెకు గతంలో వివాహం జరిగి 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత, ఆమె రహస్యంగా లోహితాశ్వను వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే రేఖ తాను పని చేస్తున్న ఆఫీసులో అతనికి డ్రైవర్ ఉద్యోగం సంపాదించడానికి సహాయం చేసింది.

ఏడాదిన్నర ప్రేమాయణం తర్వాత, ఈ జంట మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వివాహం అయినప్పటి నుండి వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. సంఘటన జరిగిన రోజు, బస్టాండ్ వద్ద వాదన తీవ్రమైంది. రేఖ, ఆమె కుమార్తె అక్కడికి వెళ్ళినప్పుడు, లోహితాశ్వ ఆమెపై దాడి చేసి, మొదట రెండుసార్లు పొడిచి, కొద్ది దూరం ఈడ్చుకెళ్లి, మరో తొమ్మిది సార్లు పొడిచి చంపాడు. పక్కనే ఉన్నవారు అడ్డుకోవడానికి ప్రయత్నించారు, కానీ అతను కత్తిని చూపి పారిపోయాడు.

Next Story