సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 12:45 PM ISTసూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఆనంద్-జ్యోతి దంపతులకు అస్మిత అనే కుమార్తె ఉంది. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
అయితే.. ఇదే గురుకుల పాఠశాలలో ఈ నెల 10న ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజుల పాటు హోం సిక్ సెలవులు ఇచ్చారు. దాంతో. అస్మిక తన ఇంటికి వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. పని నిమిత్తం ఎప్పటిలానే శనివారం ఉదయం కూడా జ్యోతి కూలి పనికి వెళ్లింది. తండ్రి కూడా పని కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకున్న అమ్మాయి ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. కూతురు శవమై కనిపిండచంతో గుండెలు పగిగేలా ఏడుస్తున్నారు. తిరిగి స్కూల్‌కు వెళ్లే రోజు ఆత్మహత్య చేసుకుంది అస్మిత. కాగా.. అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.