క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు దంప‌తులు పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. నంద్యాల న‌డిగ‌డ్డ స‌మీపంలోని మ‌ల్దార్‌పేట‌లో శేఖ‌ర్‌(35), క‌ళావ‌తి(30) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి అంజ‌ని(15), అఖిల‌(13) ఇద్ద‌రు సంతానం. శేఖ‌ర్ స్థానిక బంగారు షాపులో కంసాలిగా ప‌నిచేస్తున్నాడు.

ఇటీవ‌లే కొత్త‌గా ఇంటిని నిర్మించాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. ఇంటికి చేసిన అప్పులతో కొద్ది రోజులుగా సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత కుటుంబం మొత్తం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు క‌లుపుని తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అప్పుల బాధ‌తోనే మ‌ర‌ణించారా..? మ‌రే కార‌ణ‌మైనా ఉందా..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story