హైదరాబాద్‌లో విషాదం.. హాస్టల్ గదిలో స్టాఫ్ నర్సు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక యువ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
By - అంజి |
హైదరాబాద్‌లో విషాదం.. హాస్టల్ గదిలో స్టాఫ్ నర్సు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక యువ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వ్యక్తిగత కారణాలు, ముఖ్యంగా ఒక ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలు మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన మేఘావత్ సోని బాయి (20) గా గుర్తించారు. ఆమె గత ఏడాది కాలంగా మియాపూర్ మక్తాలోని 'ఫస్ట్ హెల్త్ లాబ్స్' లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు.
విధి నిర్వహణలో భాగంగా ఆమె మియాపూర్‌లోని రెడ్డి ఎంక్లేవ్‌లో ఉన్న ఒక పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి సోని బాయి తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించారు. తోటి నివాసితులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, సోని బాయి మరణానికి వ్యక్తిగత కారణాలే కారణమని తెలుస్తోంది.
ఒక యువకుడితో ఆమెకు ఉన్న సంబంధం, అందులో తలెత్తిన మనస్పర్థల కారణంగా ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు, ఆమె మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. చివరిగా ఆమె ఎవరితో మాట్లాడింది? మరణానికి ముందు ఏవైనా గొడవలు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.