బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని కత్తితో పొడిచి.. పైశాచిక ఆనందం
బిర్యానీ కోసం డబ్బులు ఇవ్వలేదని దారిలో వెళ్తున్న మైనర్ పై కత్తితో దాడి చేశాడు మరో బాలుడు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 7:15 AM ISTబిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని కత్తితో పొడిచి.. పైశాచిక ఆనందం
మద్యం మత్తులు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. చాలా వరకు దారుణాలు నిందితులు మద్యం మత్తులో చేసినవే ఉన్నాయి. కోపంతో మర్డర్లు.. అఘాయిత్యాలు ఇలా చాలా ఘటనలు జరిగాయి. అయితే.. ఢిల్లీలో తాజాగా మరో దారుణ సంఘటన జరిగింది. ఓ పదహారేళ్ల బాలుడు మద్యం మత్తులో దారిన వెళ్తున్న మరో 17 ఏళ్ల బాలుడిని అడ్డుకుని బిర్యానీ కొనుక్కోవాలని.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి అతను నిరాకరించడంతో దాడి చేసి.. కత్తితో దారుణంగా పొడిచాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది गले पर चाकू से 60 बार प्रहार...मर्डर के बाद किया डांस
दिल्ली के वेलकम इलाके में 21 नवंबर की रात 17 वर्षीय यूसुफ की हत्या कर दी गई। हत्यारोपी भी नाबालिग है। इसने बिरयानी के लिए 350 रुपए मांगे। यूसुफ ने मना किया तो चाकू से गोदा। #Delhi pic.twitter.com/pFKRZez8eu
ఉత్తర ఢిల్లీలోని వెల్‌కమల్ కాలనీ ప్రాంతంలో ఈ నెల 21న మంగళవారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో 16 ఏళ్ల బాలుడు ఒక మైనర్‌ను అడ్డగించాడు. బిర్యానీ కొనుక్కోవాలని అందుకు తన దగ్గరున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిందితుడు మద్యం మత్తులో ఉండటం.. పైగా డబ్బుల కోసం బెదిరించడం నచ్చని బాధితుడు మనీ ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో.. నిందితుడు ఒక్కసారిగా మైనర్‌పై దాడికి దిగాడు. గొంతు పిసికి ఊపిరి ఆడకుండా చేశాడు. దాంతో.. బాధితుడు స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఆ తర్వాత నిందితుడు తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. బాధితుడి ముఖంపైనా దారుణంగా పొడిచాడు. ముఖం, మెడ, వీపుపై దాదాపు 55 సార్లు పొడిచి గొంతు కోశాడు. కొనూపిరితో ఉన్న మైనర్‌ను ఈడ్చుకుంటూ వీధిలోకి లాక్కెళ్లాడు. కత్తితో పొడుస్తూ పైశాచికంగా అరుస్తూ ప్రవర్తించాడు. బాధితుడి జుట్టు పట్టుకుని పైకి లేపి.. జేబులో ఉన్న రూ.350 తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే.. నిందితుడిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించారు. కత్తితో నిందితుడు వారిని కూడా బెదిరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ఈ సంఘటన గురించి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ.. అతను మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బుధవారం మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.