దారుణం.. ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం సంఘటన వెలుగు చూసింది.

By Srikanth Gundamalla  Published on  18 July 2024 10:14 AM IST
son, murder,  father,    madanapalle,

దారుణం.. ఆస్తి కోసం తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన కొడుకు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం సంఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం కన్న తండ్రినే ప్లాన్ చేసి చంపాడు కొడుకు. ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతో పగ పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డి (65)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రయివేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.

పెద్ద కొడుకు రఘునాథరెడ్డి ఆన్‌లైన్ ట్రేడింగ్‌ చేసి తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. దాదాపు రూ.16 లక్షలు అప్పు చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. చేసిన అప్పులను తీర్చాలంటూ వేధింపులు రాసాగాయి. దాంతో.. కొడుకు రఘునాథరెడ్డి ఆస్తి పంచివ్వాలని.. తద్వారా తన అప్పులను తీర్చుకుంటానని తండ్రిని అడిగాడు. ఈ విషయంలో తండ్రి ససేమిరా అన్నాడు. ఈ విషయంలో కొన్నాళ్లుగా తండ్రీకొడుకుల మధ్య తగాదా నడుస్తోంది. తండ్రి ఆస్తిని ఇవ్వడం లేదని కొడకు పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రిని చంపేందుకు రఘునాథరెడ్డి ప్లాన్ చేసుకున్నాడు.

మరోసారి బుధవారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాకింగ్‌ చేస్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి చంపాడు రఘునాథరెడ్డి. ఆపై బెంగళూరులో ఉంటున్న తమ్ముడికి కాల్ చేసి విషయం చెప్పాడు. విషయాన్ని బంధువులతోపాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాతంత్రా చిన్నరెడ్డప్ప కోసం గాలించారు. గురువారం వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మనుష్య ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రఘునాథరెడ్డిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story