దారుణం.. కారులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సజీవదహనం

కారుపై పెట్రోల్ పోసిన దుండ‌గులు నిప్పంటించారు. వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం అయ్యాడు.మృతుడిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 8:41 AM IST
Tirupati District, Software Engineer

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి మండ‌లం గంగుడుప‌ల్లెలో దారుణం చోటు చేసుకుంది. కారుపై పెట్రోల్ పోసిన దుండ‌గులు నిప్పంటించారు. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం అయ్యాడు. మృతుడిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు.

నాయుడుపేట‌-పూత‌ల‌ప‌ట్టు రోడ్డులోని గంగుడుప‌ల్లె వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహం గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో ఉంది. దీంతో కారు నెంబ‌ర్ ఆధారంగా వివ‌రాలు సేక‌రించారు. మృతుడిని వెదురుకుప్పం మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లికి చెందిన నాగ‌రాజుగా గుర్తించారు. ఇత‌డు క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్నారు.

కారులో చెప్పులు, బంగారు గొలుసు ల‌భించిన‌ట్లు పోలీసులు తెలిపారు.. మృతుడు బెంగ‌ళూరు నుంచి బ్రాహ్మ‌ణ‌ప‌ల్లికి వెలుతుండ‌గా కారును ఆపిన దుండ‌గులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు.

Next Story