Hyderabad: లవ్‌లో ఫెయిల్‌ అయ్యాడని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

ప్రేమ పేరుతో ఒకరు వేధిస్తుంటే.. ఇంకొందరు ప్రేమలో విఫలమైతే తమ ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  21 Dec 2023 9:02 PM IST
software employee, suicide, love failure,  hyderabad,

Hyderabad: లవ్‌లో ఫెయిల్‌ అయ్యాడని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

ప్రేమ పేరుతో ఒకరు వేధిస్తుంటే.. ఇంకొందరు ప్రేమలో విఫలమైతే తమ ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు. ఎక్కడో కొందరు మాత్రమే సక్సెస్‌గా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కూడా యువతిని ప్రేమించాడు. కారణమేంటో తెలియదు కానీ.. ప్రేమలో విఫలం కావడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రేమలో విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన చక్రపాణి అనే యువకుడు... ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. గచ్చిబౌలిలోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కారణమేంటో తెలియదు కానీ.. అతడి ప్రేమ విఫలం అయ్యింది. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన చక్రపాణి.. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చాడు.

ఇక రూమ్‌లో ఉరివేసుకుని చక్రపాణి సూసైడ్‌ చేసుకోవడంతో.. ఈ విషయం అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు కూడా చెప్పడంతో వారూ సంఘటనాస్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దింపి.. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి కంప్లైంట్‌తో కేసు నమోదు చేశామని.. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Next Story