సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డ్రగ్స్ కేసు: సిద్ధార్థ్ పితాని అరెస్ట్

Siddharth Pithani Arrested from Hyderabad. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ను ఎన్సీబీ అధికారులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 7:40 AM GMT
Siddharth Pithani

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక డ్రగ్స్ కోణం కూడా ఉందన్న సంగతి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే..! తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ను ఎన్సీబీ అధికారులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. సుశాంత్ రాజ్ సింగ్ తో పాటు ఆయన ఫ్లాట్ లో ఉన్న సిద్దార్ద్ పితానీని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

గత ఏడాది జూన్ 14 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్నాడు. సిద్దార్ధ్ ను గతంలో కూడ ఎన్సీబీ అధికారులు పలుమార్లు విచారించారు. సుశాంత్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావడానికి రెండు వారాల ముందే సిద్ధార్థ్ ను అరెస్ట్ చేశారు. ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ హెడ్ సమీర్ వాంఖడే ఈ అరెస్టును ధృవీకరించారు. సిద్ధార్థ్ ను అరెస్టు చేశామని.. త్వరలోనే కోర్టులో అతని హాజరు పరుస్తామని అన్నారు. ఆరు నెలలుగా ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఎన్సీబీ. సిద్దార్థ్ ను సీబీఐ, నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు గత ఏడాది సెప్టెంబర్ నెలలోనూ.. ఈ నెలలో సీబీఐ అధికారులు విచారించారు.-

సుశాంత్ రాజ్‌పుత్ స్నేహితుడే సిద్దార్ధ్. బాంద్రా అపార్ట్‌మెంట్ లో సుశాంత్ తో పాటు ఆయన కూడ కలిసి ఉండేవాడు. మూడేళ్ల పాటు సుశాంత్ పాటే ఆయన ప్లాట్‌లోనే సిద్దార్ధ్ ఉన్నాడు. సుశాంత్ కు పీఆర్ మేనేజర్ గా పనిచేశాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆ కుటుంబం తరపున వాదిస్తున్న వికాస్ సింగ్ అనే న్యాయవాది సిద్దార్ధ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గతంలోనే చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుశాంత్ చివరిసారిగా సిద్దార్ధ్ తో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే..! ఆమె నెలరోజులు జైలులో గడిపిన తర్వాతా బెయిల్ పై అక్టోబర్ 2020న విడుదలైంది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి.

Next Story
Share it