గుంటూరు జిల్లాలో క‌ల‌క‌లం.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మ‌హత్యాయ‌త్నం

SI and Constable suicide attempt.ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యకు య‌త్నించ‌డం గుంటూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 3:53 AM GMT
SI, Constable commits suicide

ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యకు య‌త్నించ‌డం గుంటూరు జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. చుండూరు పోలీస్ స్టేష‌న్‌లో ప‌ని చేసే ఎస్ఐ శ్రావణి, అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రావ‌ణి గ‌తేడాది అక్టోబ‌రులో చండూరు ఎస్ఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కాగా.. ర‌వీంద్ర గ‌త ఐదు ఏళ్లుగా అదే స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. ర‌వీంద్ర‌, శ్రావ‌ణితో స‌న్నిహితంగా మెలిగేవాడ‌ని చెబుతున్నారు.

అయితే.. ఏమైందో తెలీదు కానీ.. నిన్న వీరిద్ద‌రు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. శ‌నివారం వారిద్ద‌రు స్టేష‌న్‌కు రాలేద‌ని.. వారిద్ద‌రు ఎందుకు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశార‌నే విష‌యం ఇంకా తెలియ‌ని చండూరు సీఐ ర‌మేష్‌బాబు తెలిపారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన త‌రువాత వారిద్ద‌రు కారులో వెళ్లి ముందుగా తెనాలిలో ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరార‌న్నారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా గుంటూరులోని వేర్వేరు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రు అప‌స్మార‌క స్థితిలో ఉన్నార‌ని.. వారు స్పృహలోకి వచ్చిన త‌రువాత వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు.




Next Story