ఘోరం.. దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి
Sexual harassment on physically challenged boy.కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on
10 Oct 2021 8:25 AM GMT

కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు. మానసిక దివ్యాంగ బాలుడిపైన లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామంటూ బెదిరించారు. ఇటీవల బాలుడు అనారోగ్యానికి గురికావడంతో.. ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దివ్యాంగ బాలుడు నివాసం ఉంటున్నాడు. అతడి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్, మహమ్మద్ సాదీక్, గడ్డం నందు, బోగె రాయలింగు లు కొద్ది రోజులుగా ఆ బాలుడిపై అసహరీతిలో లైంగిక దాడికి పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆ బాలుడు అస్వస్థతకు గురికావడంతో అతడి తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టి ఐదుగురుని అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Next Story