హైదరాబాద్ లో విదేశీ యువతులు, మోడల్స్ తో వ్యభిచారం.. పోలీసులు వెళ్ళగానే..!

Sex Racket Busted In Hitech City. హైదరాబాద్ లో వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  13 April 2021 9:40 AM GMT
Sex rocket

హైదరాబాద్ లో వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మోడళ్ళు, విదేశీ వనితలు కూడా ఉన్నారు. హైటెక్ పద్ధతులను పాటిస్తూ, యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ ప్రాంతంలో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ లోని ఓ హోటల్ లో తనిఖీలను నిర్వహించిన పోలీసులు వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో ముగ్గురు మహిళలను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 20 వేలకు పైగా నగదును, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్‌ చేశారు. నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్‌లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ టీమ్‌ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది. విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్‌ మణికంఠన్‌(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్‌ గదులలో రూ.29,560 నగదు, కండోమ్‌ ప్యాకెట్లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story
Share it