ఫార్మ‌సీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం కేసు.. మ‌రో ట్విస్టు.. పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన యువ‌తి

Sensational info on Ghatkesar incident.ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలోని నాగారం చౌర‌స్తాలో ఫార్మ‌సీ విద్యార్థిని అత్యాచారం కేసులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 4:59 PM IST
Sensational info on Ghatkesar incident

ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలోని నాగారం చౌర‌స్తాలో ఫార్మ‌సీ విద్యార్థిని అత్యాచారం కేసులో మ‌రో ట్విస్టు వెలుగులోకి వ‌చ్చింది. విచార‌ణ‌లో యువ‌తి పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన‌ట్లు వెల్ల‌డైంది. ఈ కేసుకు సంబంధించి యువ‌తిని పోలీసులు ప్ర‌శ్నించ‌గా.. పలు కీల‌క విష‌యాలు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. రాంప‌ల్లి చౌర‌స్తా వ‌ర‌కు ఆటోలో వెళ్లిన యువ‌తి.. ఆ త‌రువాత త‌న ప్రియుడి బైక్‌పై వెళ్లింది. ఆ త‌రువాత ప్రియుడి ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి గంజాయి తాగింది. అనంత‌రం ఆమె అనుమ‌తితోనే వారంతా అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు తెలిసింది.

యువ‌తి త‌ల్లి త‌రచూ ఫోన్ చేసి ఎక్క‌డ ఉన్నావు అని అడుగుతుండ‌డంతో.. త‌ప్పించుకునేందుకు ఆటో డ్రైవ‌ర్లు త‌న‌ను కిడ్నాప్ చేసిన‌ట్లు చెప్పింది. దీంతో భ‌య‌ప‌డిన యువ‌తి త‌ల్లి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. అప్ర‌మ‌త్తమైన పోలీసులు యువ‌తి కోసం గాలింపు చేప‌ట్టారు. యువ‌తి ఉన్న ప్రాంతంలో.. పోలీసుల సైర‌న్ వినిపించ‌డంతో.. భ‌యంతో ఆ యువ‌కులు యువ‌తిని రోడ్డు ప‌క్క‌న వ‌దిలేసి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో గ‌స్తీ కాస్తున్న పోలీసుల‌కు యువ‌తి క‌నిపించింది. మ‌త్తులో ఉన్న ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఆస్ప‌త్రిలో యువ‌తిని ప్ర‌శ్నించ‌గా.. ఆటో డ్రైవ‌ర్లు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆటో డ్రైవ‌ర్లు అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నించారు. సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించ‌గా.. ఆ యువ‌తి ప్రియుడితో క‌లిసి బైక్‌పై వెళ్లిన‌ట్లు గుర్తించారు. దీంతో ఆదిశ‌గా ద‌ర్యాప్తు చేయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.


Next Story