Hyderabad: మింట్‌ కాంపౌండ్‌ వద్ద గన్‌ మిస్‌ ఫైర్‌.. సెక్యూరిటీ గార్డు మృతి

ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో గురువారం గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రామయ్య దురదృష్టవశాత్తు మరణించాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2023 5:34 PM IST
Khairatabad Mint compound, misfire, saifabad

Hyderabad: మింట్‌ కాంపౌండ్‌ వద్ద గన్‌ మిస్‌ ఫైర్‌.. సెక్యూరిటీ గార్డు మృతి

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో గురువారం గన్ మిస్ ఫైర్ కావడంతో మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ రామయ్య దురదృష్టవశాత్తు మరణించాడు.

సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రామయ్య తుపాకీని శుభ్రం చేస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామయ్యను అధికారుల పర్యవేక్షణలో నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 46 ఏళ్ల రామయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్నారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సైఫాబాద్ పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సైఫాబాద్ సీఐ సత్తయ్య మిస్ ఫైర్ జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించగా, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్, సీఐ సత్తయ్య ప్రింటింగ్ ప్రెస్‌లోని సెక్యూరిటీ సిబ్బందిని ఘటనపై ఆరా తీశారు.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు సైఫాబాద్ పోలీసులు తెలిపారు.

Next Story