విషాదం.. అందరూ చూస్తుండానే రైలుకిందపడి సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
Secretariat women employee suicide.ఫ్లాట్‌పైం కూర్చున్న ఓ యువతి పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టాలపై పడుకుండి పోయింది.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2021 10:54 AM ISTవిజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నాం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు స్టేషన్‌కు వస్తుండగా.. ఫ్లాట్‌పైం కూర్చున్న ఓ యువతి పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టాలపై పడుకుండి పోయింది. కొందరు గమనించి కేకులు వేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. రైలు.. ఆ యువతి పై నుంచి దూసుకెళ్లడంతో ఆ యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్యకు పాల్పడిన యువతి సచివాలయ ఉద్యోగిగా సమాచారం.
రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నర్సీపట్నానికి చెందిన వెంకటరమణ-లక్ష్మీ దంపతుల కుమారై రాజ్యలక్ష్మీ(26) విశాఖ సచివాలయంలో వెల్పేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె సోదరి మహాలక్ష్మీ హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే ఆ తల్లిదండ్రులు తమ ఇద్దరు కూతుర్లు మంచి ఉద్యోగం సాధించి సెలటిలయ్యారన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. విధులకు హాజరుకావడానికి వెలుతున్నానని చెప్పి ఇంట్లోంచి రాజ్యలక్ష్మీ బయలుదేరింది. శనివారం మధ్యాహ్నం విజయనగరం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మూడో నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద కూర్చోంది.
అదే సమయంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ అనౌన్స్‌మెంట్ విని నాల్గో నెంబర్ ప్లాట్‌ఫాంలోకి వెళ్లింది. రైలు ఫ్లాట్‌పాంపైకి వస్తుండగా.. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి పట్టాలపైకి దూకి రైలుకి ఎదురెళ్లి పట్టాలపై పడుకుంది. ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది అందరూ చూస్తుండగానే రైలు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఇలా రెప్పపాటులో అందరి ఎదుటె రాజ్యలక్ష్మీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా.. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.