నెల్లూరు జిల్లాలో విషాదం.. ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స‌చివాల‌య ఉద్యోగులు

Secretariat employees committed suicide in Nellore dist.నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2021 11:33 AM IST
నెల్లూరు జిల్లాలో విషాదం.. ఒకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న స‌చివాల‌య ఉద్యోగులు

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జీలో ఇద్ద‌రు స‌చివాల‌య ఉద్యోగులు ఒకే తాడుతో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డారు. వీరి ఆత్మ‌హ‌త్య‌కు ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా రూరల్‌ మండలానికి చెందిన హరీష్‌ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా ప‌నిచేస్తుండ‌గా..నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా ప‌నిచేస్తోంది. వీరిద్ద‌రూ శుక్ర‌వారం విధుల‌కు హాజ‌రుకాకుండా.. న‌గ‌ర శివారు ప్రాంతంలోని నందా లాడ్జిలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు.

అనంత‌రం ఇద్ద‌రూ ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. రాత్రి అయినా.. ఇద్ద‌రు ఇంటికి రాక‌పోవ‌డంతో.. వారి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈక్ర‌మంలో వారిద్ద‌రూ లాడ్జిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అనే విష‌యం తెలిసింది. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను ప‌రిశీలించి.. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రేమ వ్య‌వ‌హారం కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు.




Next Story