కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ఒక‌రి మృతి

RTC Bus hits Lorry Container near Jadcherla.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో గురువారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 8:15 AM IST
కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ఒక‌రి మృతి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో గురువారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కంటైన‌ర్‌ను ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే.. తిరుప‌తి డిపోకు చెందిన ఆర్టీసీ స్సు తిరుప‌తి నుంచి హైద‌రాబాద్‌కు వెలుతోంది. ఈ క్ర‌మంలో జ‌డ్చ‌ర్ల మండ‌ల ప‌రిధిలోని చిట్టి బోయిన్‌ప‌ల్లి గ్రామ స‌మీపంలోకి రాగానే ముందు వెలుతున్న కంటైన‌ర్‌ను ఢీ కొట్టింది.ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు డ్రైవ‌ర్ క్యాబిన్‌లోనే చిక్కుకుని మృతి చెందాడు.

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు ప్ర‌యాణీకులకి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ‌ర్షం కుర‌వ‌డం, ఆపై మంచు క‌మ్ముకోవ‌డంతో ముందు వెలుతున్న వాహ‌నం క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదం జరిగిన‌ట్లు బావిస్తున్నారు.

Next Story