సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కట్టకమ్మగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టిన ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. హైదరాబాదు నుంచి (రాజమండ్రి) గోకవరంకు వెళుతున్న మహి ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో రెండు బస్సుల్లోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న బస్సు ఒక్కసారిగా రోడ్డుమీదికి రావడం తోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
రోడ్డు ప్రమాదంపై స్పందించిన మంత్రి
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో కోదాడ పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ బస్సు ప్రమాదం పై రవాణా మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీసి.. అధికారులతో విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులను మెరగైననైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇచ్చారు.