ఉద్యోగం నచ్చలేదని.. ఆర్ఎస్సై ఆత్మహత్య
RSI commits suicide in Kadapa.ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులు
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 4:19 AM GMT
ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేయసి మాట్లాడడం లేదనో ఇలా చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. వారిని నమ్ముకున్న వారికి తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తనకి ఇష్టంలేకున్నా తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీసు ఉద్యోగం సంపాదించాడు. అయితే.. చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. ఈ విషయం అతడి మనస్సును తొలచివేస్తుంది. తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక ఓ ఆర్ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కడపలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 2021లో కడప ఏఆర్ విభాగంలో శ్రీకాకుళం జిల్లా సరుజుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చంద్రారావు(26) ఆర్ఎస్సైగా విధుల్లో చేరారు. కడప పట్టణంలో ఎన్జీవో కాలనీలో ఓ రూమ్‌ని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తల్లిదండ్రుల కోరిక కాదనలేక పోలీసు ఉద్యోగంలో చేరాడు. ఇంకా వివాహం కాలేదు. ఈ నెల 10న స్వగ్రామానికి వెళ్లి తిరిగి 28న కడపకు వచ్చారు. అయితే.. స్వగ్రామంలో ఎం జరిగిందో తెలీదు కానీ.. గురువారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉద్యోగం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.