ఒక వైపు కోవిడ్‌తో బాధపడుతూ మృత్యువాత పడుతుంటే మరోవైపు పలు కోవిడ్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల కరోనాతో కాకుండా అగ్ని ప్రమాదాల రూపంలో బలవుతున్నారు. తాజాగా రొమేనియా దేశం పియాట్రా నిమ్ట్ నగరంలోని ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల 10 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతి కాగా, పది మంది వరకకు గాయపడ్డారు. కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ వార్డులో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రోగులందరినీ బయటకు పంపించేశారు.
క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులేనని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అగ్ని ప్రమాదానికి బలైన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.