నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు హరనాధపురంకి చెందిన మహేంద్ర తన కుటుంబంతో కలిసి తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో తన కుమారుడిని జాయిన్ చేసి తిరిగి ఇంటికి వస్తున్నారు.
ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్దకు చేరుకునే సరికి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. వేగంగా కారు ఢివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈప్రమాదంలో మహేంద్ర తండ్రి సుధాకర్‌రావు(76), భార్య అపర్ణ(35) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రతో పాటు అతడి తల్లి సుజాత, కుమారై సిసింద్రి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.