రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

Road accident in Medchal Malkajgiri district.మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండ‌లంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2021 11:32 AM IST
రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండ‌లంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రాజీవ్ ర‌హ‌దారిపై వేగంగా వ‌చ్చిన లారీ.. కారును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న తుర్క‌ప‌ల్లి వ‌ద్ద చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు సంఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించ‌గా.. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను జిగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story