తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. పోలీసులపై దూసుకెళ్లిన లారీ

Road Accident in East Godavari Dist.తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 7:49 AM IST
Road Accident

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు పోలీసులు అక్క‌డిక్క‌డే దుర్మ‌ర‌ణం పాలయ్యారు. మృతుల‌ను హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లారు.

ఈ క్రమంలో ఉండూరు వంతెన వద్ద వాహనం కోసం నిరీక్షిస్తున్న క్రమంలో లారీ వచ్చి ఢీకొట్టింది. మృతులు కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్ నిద్ర మ‌త్తు వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.


Next Story