ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సును ఢీ కొట్టిన టిప్ప‌ర్‌

Road Accident in Choutuppal.యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2021 8:06 AM IST
ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సును ఢీ కొట్టిన టిప్ప‌ర్‌

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చౌటుప్ప‌ల్ మండ‌లం ల‌క్కారం స‌మీపంలో విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై ఓ ప్రైవేటు బ‌స్సును టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో బ‌స్సు డ్రైవ‌ర్‌, టిప్ప‌ర్ డ్రైవ‌ర్ ల ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రైవేటు బ‌స్సు కాకినాడ నుంచి హైద‌రాబాద్ వెలుతోంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. -

ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌రో ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బ‌స్సును లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవ‌ర్‌కు గాయాలు కావ‌డంతో అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా జాతీయ ర‌హ‌దారిపై భారీగా 2 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది, ప్ర‌మాదానికి గురైన వాహ‌నాల‌ను రోడ్డుపై నుంచి ప‌క్క‌కు తొల‌గించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్నారు.

Next Story