Hyderabad: లాడ్జికి తీసుకెళ్లి బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి
మహిళలపై అత్యాచార సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 May 2024 2:30 PM ISTHyderabad: లాడ్జికి తీసుకెళ్లి బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి
మహిళలపై అత్యాచార సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తెలియని వారు లైంగిక దాడులు చేస్తుంటే.. మరికొన్ని చోట్ల తెలిసినవారే అఘాయిత్యాలకు పాల్పడుతూ జీవితాలను చెరిపేస్తున్నారు. కొందరు కామాంధులు అయితే చిన్నారులు అని కూడా చూడకుండా దారణప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ బాలికను నమ్మించి ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సికింద్రాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ బాలిక (16 ఏళ్లు).. తరచూ ఫోన్ వాడసాగింది. అది గమనించిన తల్లిదండ్రులు.. ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడొద్దని హెచ్చరించారు. దాంతో.. అలిగిన ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరిధిలోనే ఉన్న ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి (28) బాలికతో మాట్లాడాడు. అన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత బాలికను మాటల్లో పెట్టి నమ్మించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను తీసుకుని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. రూమ్‌లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇక బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత నిందితుడిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక దర్యాప్తు జరుగుతోందనీ.. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.